
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40) నడుచుకుంటూ వెళుతుండగా, నీరుగట్టువారిపల్లెకు చెందిన సురేష్ నాయక్ ద్విచక్రవాహనంలో వేగంగా వెళుతూ ఢీకొన్నాడు. ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి వెళ్లగా, సురేష్‌నాయక్ సైతం గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
బైక్ ఢీకొని..
బైక్ ఢీకొని మెకానిక్ తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఫిషింగ్‌పేటలో నివాసం ఉన్న అయూబ్‌ఖాన్(55) బసినికొండలోని కారు షెడ్‌లో టింకర్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం షెడ్‌వద్దకు బైక్‌లో వెళుతుండగా, పుంగనూరు రోడ్డులోని మున్సిపల్ బోర్డు సమీపంలో వెనుకనుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం అయూబ్‌ఖాన్‌ను ఢీకొంది. ప్రమాదంలో కుడికాలు విరగ్గా, స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.