వినుకొండలో ఉద్రిక్తత | YSRCP Supporters Protest At Vinukonda | Sakshi
Sakshi News home page

వినుకొండలో ఉద్రిక్తత

Jun 20 2026 1:37 PM | Updated on Jun 20 2026 3:55 PM

YSRCP Supporters Protest At Vinukonda

సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినుకొండ ఎంట్రన్స్‌ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జైలు నుంచి విడుదలై మొదటిసారిగా వినుకొండ వెళ్తున్నారు. ఈ క్రమంలో బొల్లా బ్రహ్మనాయుడుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దీంతో, వినుకొండ ఎంట్రన్స్‌లో బ్రహ్మనాయుడు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, అక్కడ వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. 

వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement