విజయవాడ: ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు(బుధవారం) రాత్రికి పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దాంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ముఖ్యంగా విజయనగరం, ఎస్ కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది.
మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


