న్యూస్‌రీల్
ప్రజలపై భారమే భారం...
అంతర్జాతీయ పరిణామాలు, ప్రకృతి విపత్తులు, సాగులో అనిశ్చితి వంటి అంశాల ప్రభావం చివరకు సామాన్యుడిపై పడుతోంది. రోజువారీ అవసరమైన బియ్యమే భారంగా మారడంతో చివరకు నూకలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బియ్యం ధరలు పెరగడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతోంది. ఇప్పటికై నా ధరల నియంత్రణకు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
కొత్త బియ్యమే దిక్కు
సాధారణంగా ఎక్కువ మంది వినియోగదారులు పాత బియ్యానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుతం పాత బియ్యం లభ్యత తగ్గిపోవడంతో కొత్త బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పాత, కొత్త బియ్యం రెండింటి ధరలనూ పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంలో కూడా యంత్రాంగం విఫలమైంది.
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● మూడు నెలల్లోనే 25 కేజీల
బస్తాపై భారీగా పెంపు
● ధరల నియంత్రణకు చర్యలు
చేపట్టని సర్కారు
● ఎల్‌నినో, యుద్ధాల సాకుతో
అమాంతం పెంచిన వ్యాపారులు
● నిఘా లేక, తనిఖీలు చేపట్టకుండా
అధికారుల చోద్యం
● సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై
తీవ్ర ప్రభావం
అమ్మకానికి సిద్ధంగా ఉన్న బియ్యం బస్తాలు
బియ్యం ధర దడ పుట్టిస్తోంది. కనీసం నూకలు కొందామన్నా బాబోయ్ అనిపిస్తోంది. ధరలన్నీ మండిపోతుంటే సామాన్య ప్రజలు ఏం కొంటాం, ఏం తింటాం అంటూ నిట్టూరుస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బియ్యం ధరలు పెరిగాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. 25 కేజీల బియ్యం బస్తాపై రూ.300 నుంచి రూ.400కుపైగా పెరిగిందని, దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణపై పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.


