శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధ్యం | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధ్యం

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధ్యం

నరసరావుపేట రూరల్‌: శాసీ్త్రయ పద్ధతులను పాటించడం ద్వారా ఆయిల్‌ పామ్‌ సాగులో మెరుగైన దిగుబడులు పొందవచ్చని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రామచంద్రుడు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగులో ఆధునిక పద్ధతులు, యాజమాన్య చర్యలపై క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఇందులో భాగంగా నాదెండ్ల మండలం కనపర్రులో ఆయిల్‌ పామ్‌ పంటను సందర్శించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామచంద్రుడు మాట్లాడుతూ మొదటి సంవత్సరం నుంచి ప్రతి మొక్కకు ఎరువుల వినియోగం యూరియా 870 గ్రాములు, సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ 1250 గ్రాములు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 667 గ్రాములు, బోరాన్‌ 25 గ్రాములు చొప్పున అందించాలని తెలిపారు. రెండవ నుంచి నాలుగో సంవత్సరం వరకు ఏటా ఎరువులు రెట్టింపు వాడాలని తెలిపారు. మొక్క నాటిన 14 నుంచి 18 నెలల తరువాత పూతకు వస్తుందని వివరించారు. వేరు వ్యవస్ధ బాగా అభివృద్ధి చెంది నీరు, పోషకాలు గ్రహించి చెట్టు బాగా పెరగాలంటే పూల గుత్తులను తొలగించాలని సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ రైతులకు సాగులో శాసీ్త్రయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కీలకపాత్ర పోషించాలని తెలిపారు. ఆయిల్‌పామ్‌ పంటకు సంబంధించిన రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుంటూరు రూరల్‌: వ్యక్తి తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉండి, అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడంపాడు గ్రామ శివారులో గల పోగాకు గోడౌన్‌ వద్ద సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర రక్తగాయాలతో ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనస్థలానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల గాయాలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించామని, మృతుడు బ్లాక్‌ కలర్‌ చొక్కా, బ్లాక్‌ ప్యాంట ధరించి ఉన్నాడన్నారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఇతను భిక్షాటన చేస్తూ ఉంటాడని తెలిసింది. మృతుడి ఆచూకీ తెలిసినవారు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు గానీ లేదా 8688831376, 8688831607 సెల్‌ నంబర్లలో గానీ సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement