వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 20వ రోజు షెడ్యూల్‌ ఇదే.. | Ysrcp Samajika Sadhikara Bus Yatra Day 20 Schedule | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర.. 20వ రోజు షెడ్యూల్‌ ఇదే..

Nov 24 2023 10:19 AM | Updated on Nov 24 2023 11:02 AM

Ysrcp Samajika Sadhikara Bus Yatra Day 20 Schedule - Sakshi

నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మంచిని వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది.

సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మంచిని వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం నంద్యాల జిల్లాలో శ్రీశైలం, ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాల్లో జరుగుతుంది. గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, వైఎస్సార్‌ జిల్లా కడపలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు జనం నీరాజనాలు పలికారు.

పార్వతీపురం మన్యం జిల్లా..
పాలకొండలో ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. ఉదయం 10.30 గంటలకు చిన్న మంగళాపురంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం జరగనుంది. 12.00 లకు మంగళాపురం గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. సాయంత్రం 3.30 కి పాలకొండ ప్రధాన సెంటర్ లో భారీ బహిరంగ సభ జరగనుంది.

ఎన్టీఆర్ జిల్లా:
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో సాధికార యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు శకుంతలమ్మ డిగ్రీ కళాశాలలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం శకుంతలమ్మ కళాశాల నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 3:30 గంటలకు బలుపుపాడు నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు హాజరుకానున్నారు.

నంద్యాల జిల్లా:
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరు మండలం నల్ల కాల్వ వద్ద వైఎస్సార్‌ స్మృతి వనంలో తటస్థులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులతో సమావేశం అనంతరం వైఎస్సార్‌ స్మృతివనం నుంచి ఆత్మకూరు వరుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు హాజరుకానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement