పోరంకిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు | Tdp Goons Attempt To Attack Ysrcp Leader Devabhaktuni Chakravarthy | Sakshi
Sakshi News home page

పోరంకిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

Jun 25 2026 9:21 PM | Updated on Jun 25 2026 9:25 PM

Tdp Goons Attempt To Attack Ysrcp Leader Devabhaktuni Chakravarthy

సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తిపై దారికాచి దాడికి యత్నించారు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు చక్రవర్తి వస్తుండగా.. పోరంకి వద్ద భారీగా మోహరించిన టీడీపీ గూండాలు.. చక్రవర్తి కారును అడ్డుకున్నారు. టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు.

టీడీపీ గూండాలు చుట్టుముట్టడంతో కారు దిగిన చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చక్రవర్తిని తరలిస్తున్న పోలీసు వ్యాన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చిబూతులతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement