రేపు వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం నిరసనలు | Ysrcp Panchayat Raj Wing Protests On April 27th | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం నిరసనలు

Apr 26 2026 8:34 AM | Updated on Apr 26 2026 12:25 PM

Ysrcp Panchayat Raj Wing Protests On April 27th

సాక్షి, అమరావతి: పంచాయతీ రాజ్‌ శాఖలో పెండింగ్‌ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement