మా కోడలు ఓటు ఎక్కడుంది ‘సర్‌’? | Where Is My Daughter In Law Voter Id? Prakasam Man Questions Officials Over Missing Voter Details | Sakshi
Sakshi News home page

మా కోడలు ఓటు ఎక్కడుంది ‘సర్‌’?

Jul 4 2026 10:56 AM | Updated on Jul 4 2026 11:08 AM

Where Is My Daughter In Law Vote Id Prakasam

ప్రకాశం జిల్లా: ‘మా కోడలు ఓటు ఎక్కడుంది సార్‌.. అంటూ ప్రకాశం జిల్లా కురిచేడు ఎన్‌ఎస్‌పీ కాలనీకి చెందిన మేడికొండ జగదీశ్వరరావు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. ముగ్గురికి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చారు. నా కోడలు కృష్ణ చైతన్య ఎన్యుమరేషన్‌ ఫారం ఇంత వరకు ఇవ్వలేదు. 

స్థానిక అధికారులు ఎవరిని అడిగినా తెలియదని చెబుతున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో ఓటరు ఎన్యుమరేషన్‌ కార్యక్రమం మరో 10 రోజుల్లో ముగియనుంది. నా కోడలు గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంది. ఇప్పుడు ఓటు లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అసలు మా కోడలు ఓటు ఎక్కడ ఉందో అధికారులు చెప్పాలి.’ అని జగదీశ్వరరావు కోరారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement