దేశవ్యాప్తంగా గుర్తించిన 103 వారసత్వ క్షేత్రాల్లో మన రాజంపేట రైల్వేస్టేషన్‌కు చోటు
1866 బ్రిటీష్ కాలం నాటి రవాణా వైభవం నుండి నేటి అమృత్ భారత్ న్యూలుక్ దాకా చారిత్రక ప్రస్థానం!
అమృత్ భారత్‌తో సరికొత్త లుక్
నవంబర్‌లో ‘స్టేషన్ మహోత్సవ్’ నిర్వహణ
ఆంధ్రప్రదేశ్, కడప: రాయలసీమ ప్రాంత వాణిజ్య ప్రగతికి, దక్షిణ భారతదేశ రైల్వే చరిత్రకు మైలురాయిగా నిలిచిన రాజంపేట రైల్వేస్టేషన్ ఘనమైన శతాబి్ధన్నర చరిత్రాత్మక ఉత్సవాలను జరుపుకోనుంది. ఆంధ్రప్రదేశా రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర రైల్వేబోర్డు నిర్వహించ తలపెట్టిన ‘హెరిటేజ్ స్టేషన్ మాసోత్సవం’ వేడుకలకు రేణిగుంట, వాల్తేరులతో పాటు రాజంపేట ఎంపిక కావడం విశేషం. భారతీయ రైల్వేలోని మొత్తం 103 వారసత్వ స్టేషన్లలో రాజంపేటకు చోటు దక్కింది. ఈ చారిత్రక మైలురాయిపై రైల్వేబోర్డు, హెరిటేజ్ కమిటీలు రాబోయే 4 నెలల కాలానికి పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి.
రైల్వే జోన్‌ల మార్పులిలా
బ్రిటీషు రైల్వే పాలకులు 1866 నవంబర్ 15న మద్రాస్ రైల్వే బ్రాడ్‌గేజ్ మార్గంగా దీనిని ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి ముంబైలను కలిపే ప్రతిష్టాత్మక ‘నార్త్ వెస్ట్ లైను’ కింద ఇది ప్రారంభమైంది. నాటి నుంచి ఈ స్టేషన్ పలు జోన్ల పరిధిలోకి మారుతూ వచ్చింది. 1908లో ఎంఎస్‌ఎం రైల్వేగా, 1956లో సదరన్ రైల్వే (గుంతకల్ డివిజన్)గా, 1977లో దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) గా మారి.. 2026లో ఏపీ సొంత రైల్వే జోన్ దక్షిణ తీర రైల్వే (విశాఖపట్నం) పరిధిలో కొనసాగుతోంది.
1999లో నక్సల్స్ పేలి్చవేత.. రూ.3 కోట్ల భారీ నష్టం!
రాజంపేట రైల్వేస్టేషన్ సుదీర్ఘ చరిత్రలో ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. 1999 డిసెంబరు 12న పీపుల్స్‌వార్ గ్రూప్‌కు చెందిన నక్సలైట్లు రాజంపేట రైల్వేస్టేషన్‌ను బాంబులతో పేలి్చవేశారు. ఈ దాడిలో పాత స్టేషన్ భవనం ధ్వంసం కాగా.. అప్పట్లోనే రైల్వే శాఖకు రూ.3 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత దక్షిణమధ్య రైల్వే కొత్తభవనాలను నిర్మించింది.
ఎంపీ కృషి వల్ల ‘అమృత్ భారత్’లో చేరికతో కొత్తలుక్!
ఈ చారిత్రక స్టేషన్‌ను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తన నిరంతర కృషితో ‘అమృత్ భారత్’ స్కీం కింద చేరి్పంచి, ఏకంగా రూ.28.51 కోట్ల భారీ నిధులు మంజూరు చేయించారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి వసతులు కలి్పంచి స్టేషన్‌కు సరికొత్త లుక్ తీసుకువచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి దేశ రాజధానికి వెళ్లే ఢిల్లీ రైలు హాల్టింగ్‌తో పాటు పలు రైళ్ల నిలుపుదలను సాకారం చేశారు. అలాగే సబ్‌వే నిర్మాణం కొరకు గత బడ్జెట్‌లో రూ.2 కోట్లు కేటాయించేలా ఎంపీ కృషి చేశారు.
శతాబ్దిన్నర ఉత్సవాల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రదర్శనలు!
రాబోయే ఉత్సవాల ప్రత్యేక నెలలో రైల్వేబోర్డు ఆదేశాల మేరకు స్టేషన్‌లో జెండామార్చ్, 160 ఏళ్ల చారిత్రక ఫొటోల ప్రదర్శన, హీలియం బెలూన్లు ఎగరవేయడం, ‘విరాసిత్’ స్మారక పత్రిక ఆవిష్కరణ మరియు లేజర్ షోలు, ప్రొజెక్షన్ మ్యాపింగ్ నిర్వహించనున్నారు. స్థానిక విశిష్ట వ్యక్తులు, ఉత్తమ రైల్వే ఉద్యోగులను అవార్డులతో సత్కరించనున్నారు.
విడదీయరాని అనుబంధం
రాజంపేట స్టేషన్‌లో 24 ఏళ్లు పనిచేసిన నాకు ఈ చారిత్రక స్టేషన్‌తో విడదీయరాని అనుభవం ఉంది. అలాగే సౌత్‌స్రెంటర్ రైల్వే మజూ్ధర్ యూనియన్ నేతగా కారి్మకులకు సేవలందించాను. నాడు ఏ రైలు వచ్చినా లోడింగ్ కోసం ప్రత్యేక హాలి్టంగ్ ఉండేది, రాజంపేట ఇప్పుడు రైల్వేబోర్డు వారసత్వస్టేషన్‌గా గుర్తించడం సంతోషదగ్గ అంశం.
– పసుపులేటి సుబ్బరామయ్య, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్
నేడు హెరిటేజ్ గుర్తింపు రావడం సంతోషకరం
ఇక్కడి పార్శిల్ విభాగంలో 12 ఏళ్లు పనిచేశాను. ఆ రోజుల్లో ప్లాట్‌ఫారాలపై వెళుతుంటే లోడింగ్ కోసం సిద్ధంగా ఉంచిన నిమ్మకాయల బస్తాల వల్ల అవతలి మనుషులు కూడా కనిపించేవారు కాదు. బాంబే, కోయంబత్తూరు, ఎర్నాకులం సుదూర ప్రాంతాలకు నిరంతరాయంగా వ్యాగిన్ల ద్వారా ఎగుమతులు సాగేవి.
– పరమేశ్వరరాజు, రిటైర్డ్ చీఫ్ కమర్షియల్ సూపర్‌వైజర్


