అమరావతి: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడే ఉన్నారు.
మరోవైపు, శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్‌నినోపై చర్చ అసెంబ్లీలో అవసరం లేదా అని, మండలిలోనే కావాల్సి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. రైతాంగం ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిందే తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించాలని చెప్పారు.


