
సాక్షి, తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం కలిశారు. టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించటంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్ గా భూమన బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్‌రెడ్డి 1958, ఏప్రిల్ 5న వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించారు. ఆయన తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2004–06 మధ్య తుడా (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్‌గా భూమన పనిచేశారు. ఆ తర్వాత 2006–08 మధ్య టీటీడీ బోర్డు చైర్మన్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేశారు.
(నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్)