YSRCP MLA Kasu Mahesh Reddy Challenges To Nara Lokesh - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్‌

Aug 9 2023 11:09 AM | Updated on Aug 9 2023 11:33 AM

Ysrcp Mla Kasu Mahesh Reddy Challenges Nara Lokesh - Sakshi

వైఎస్సార్‌సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్‌సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్‌వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్‌ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్‌లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్‌ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్‌ ఇరిగేషన్‌ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.
చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement