Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం | Tirumala TTD Latest News Updates On August 15 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Aug 15 2024 8:29 AM | Updated on Aug 15 2024 12:32 PM

Tirumala TTD Latest News Updates On August 15 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.26 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement