సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎర్రగుడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయ పాల డైరీ చైర్మన్, ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విజయ పాల డైరీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నె గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, విజయ పాల డైరీ డైరెక్టర్ విజయసింహారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు సమాచారం.


