breaking news
Vijaya Milk Dairy
-
'వీరమల్లు' ఫేక్.. విజయ మిల్క్ ఎండీ కౌంటర్
'హరి హర వీరమల్లు' రేంజ్ ఇదంటూ.. మా హీరోకు మరోకరు పోటీ లేరని పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జులై 24న సినిమా విడుదల కానుంది. మూవీకి పెద్దగా బజ్ లేకపోవడంతో మొన్న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ఫేక్ ప్రచారం అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎయిరిండియా, ఇండిగో విమానాలకు వారి పిచ్చి అభిమానం తాకింది. అంతటితో ఆగని ఫ్యాన్స్ బస్సులు, విజయ పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బింగో చిప్స్ ఇలా ఏదీ వదలడం లేదు. ఇదంతా వీరమల్లు ఇమేజ్ అంటూ పవన్ కల్యాణ్ ఖాతాలో వేస్తున్నారు. అయితే, నెటిజన్లు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకనైనా మారండ్రా అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయ డైరీ ఎండీ ఈశ్వర్ బాబు రెస్పాండ్ అయ్యారు.విజయవాడ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ మిల్క్‌కు 60 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ భారత్‌లోనే టాప్‌లో ఉన్న సంస్థగా గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే, ఆ సంస్థ అనుమతి లేకుండా విజయ మిల్క్ ప్యాకెట్లపై హరి హర వీరమల్లు పోస్టర్ అంటూ సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు కూడా వైరల్ కావడంతో వివాదం మొదలైంది. దీంతో తాజాగా విజయ డైరీ ఎండీ రియాక్ట్ అయ్యారు. అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపడేశారు. నిబంధనలకు విరుద్దంగా ఇలా చేయడం నేరం అని ఆయన పేర్కొన్నారు. బాగా పాపులర్ అయిన విజయ బ్రాండ్‌ను వాడుకోవడానికి వారి అభిమానుల్లో ఎవరైనా ఇలా ఎడిట్ చేసి ఉంటారని ఈశ్వర్ బాబు తెలిపారు. ఎప్పటికీ తమ సంస్థ మరోక బ్రాండ్‌ను ప్రచారం చేయదని క్లారిటీ ఇచ్చారు.వీరమల్లు బజ్ కోసం సోషల్‌మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానులు ఎంచుకుంటున్న అడ్డదారులపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తప్పుడు దారిలో ప్రచారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ఇలాంటి ఫేక్ ప్రచారం మాత్రం ఎవరు చేసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనేనని కొందరు గట్టిగానే చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ బతుకు ఎందుకంటూ మండిపడుతున్నారు. అయితే, పవన్ ఫ్యాన్స్‌తో పాటు జనసేన శతఘ్ని సోషల్‌మీడియా ఖాతా నుంచి ఒక వివరణ వచ్చింది. ఇదంతా పవన్ మీద కోపంతో కొందరు కావాలని ఇలా మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తున్నారని రాజకీయ రంగు పూసేందుకు తెర లేపింది. కానీ, సదరు పోస్టర్లను వైరల్ చేస్తున్న వారి సోషల్‌మీడియా ఖాతాలను వారు ఒకసారి చెక్ చేస్తే అసలు రంగు ఏంటో తెలుస్తుందని గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఆ పేజీలన్నీ పవన్ కల్యాణ్ అభిమానులవే అని క్లియర్‌గా తెలిసిపోతుంది.Massive Pramotions raaaa @HHVMFilm 🔥🔥🔥🔥🔥🔥#HariHaraVeeraMallu pic.twitter.com/iPTdQrhVbu— 𝘽𝙝𝙖𝙜𝙖𝙩 ✰🦅 (@Ustaad_Kalyan18) July 18, 2025#HariHaraVeeraMallu @PawanKalyanHyderabad metro promotions on 🔥🔥🔥 pic.twitter.com/b4deBcyyAh— #VOTE FOR GLASS (@dspreddy12345) July 17, 2025 -
ఆవుపాల ధర పెంపు
రాయచోటి టౌన్: విజయా పాల డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు సంక్రాంతి చిరుకానుకగా పాల ధర పెంచినట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన రాయచోటి డెయిరీని తనిఖీ చేయడానికి వచ్చారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్నిమార్పులు తీసుకరాన్నుట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే మొదట పాల ధరలు పెంచినట్లు ఆయన చెప్పారు. వీటిలో కూడా కేవలం ఆవు పాలకు మాత్రమే ధరలు పెంచామని గేదె పాలకు మాత్రం ధరల్లో యథాతథంగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇకపై బిల్లులను క్యాష్ రూపంలో కాకుండాబ్యాంక్ అకౌంట్లలలో జమచేస్తామన్నారు. గతంలో టీఎస్ రేటు ప్రకారం రూ.190లు ఉన్న ఆవుపాలు పెరిగిన ధరల ప్రకారం రూ.200లకు పెంచామని చెప్పారు. అలాగే గతంలో పెడింగ్‌లో ఉన్న రైతులు, ఏజెంట్ల పాల బిల్లులను త్వరలోనే చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.