
ఆవుపాల ధర పెంపు
విజయా పాల డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు సంక్రాంతి చిరుకానుకగా పాల ధర పెంచినట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
రాయచోటి టౌన్: విజయా పాల డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు సంక్రాంతి చిరుకానుకగా పాల ధర పెంచినట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన రాయచోటి డెయిరీని తనిఖీ చేయడానికి వచ్చారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్నిమార్పులు తీసుకరాన్నుట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే మొదట పాల ధరలు పెంచినట్లు ఆయన చెప్పారు. వీటిలో కూడా కేవలం ఆవు పాలకు మాత్రమే ధరలు పెంచామని గేదె పాలకు మాత్రం ధరల్లో యథాతథంగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇకపై బిల్లులను క్యాష్ రూపంలో కాకుండాబ్యాంక్ అకౌంట్లలలో జమచేస్తామన్నారు. గతంలో టీఎస్ రేటు ప్రకారం రూ.190లు ఉన్న ఆవుపాలు పెరిగిన ధరల ప్రకారం రూ.200లకు పెంచామని చెప్పారు. అలాగే గతంలో పెడింగ్‌లో ఉన్న రైతులు, ఏజెంట్ల పాల బిల్లులను త్వరలోనే చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.