'వీరమల్లు' ఫేక్‌.. విజయ మిల్క్‌ ఎండీ కౌంటర్‌ | Vijaya Milk MD Comments On Hari Hara Veeramallu Poster | Sakshi
Sakshi News home page

'వీరమల్లు' ఫేక్‌.. విజయ మిల్క్‌ ఎండీ కౌంటర్‌

Jul 19 2025 10:43 AM | Updated on Jul 19 2025 1:16 PM

Vijaya Milk MD Comments On Hari Hara Veeramallu Poster

'హరి హర వీరమల్లు' రేంజ్ఇదంటూ.. మా హీరోకు మరోకరు పోటీ లేరని పవన్కల్యాణ్అభిమానులు సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జులై 24న సినిమా విడుదల కానుంది. మూవీకి పెద్దగా బజ్‌ లేకపోవడంతో మొన్న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్‌ అంటూ ఫేక్ప్రచారం అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎయిరిండియా, ఇండిగో విమానాలకు వారి పిచ్చి అభిమానం తాకింది. అంతటితో ఆగని ఫ్యాన్స్ బస్సులు, విజయ పాల ప్యాకెట్లు, వాటర్బాటిల్స్‌, బింగో చిప్స్ఇలా ఏదీ వదలడం లేదు.  ఇదంతా వీరమల్లు ఇమేజ్అంటూ పవన్కల్యాణ్ఖాతాలో వేస్తున్నారు. అయితే, నెటిజన్లు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకనైనా మారండ్రా అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయ డైరీ ఎండీ ఈశ్వర్బాబు రెస్పాండ్అయ్యారు.

విజయవాడ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ మిల్క్కు 60 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ భారత్‌లోనే టాప్‌లో ఉన్న సంస్థగా గుర్తింపు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే, సంస్థ అనుమతి లేకుండా విజయ మిల్క్ప్యాకెట్లపై హరి హర వీరమల్లు పోస్టర్అంటూ సోషల్మీడియాలో వైరల్చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు కూడా వైరల్ కావడంతో వివాదం మొదలైంది. దీంతో తాజాగా విజయ డైరీ ఎండీ రియాక్ట్అయ్యారు. అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపడేశారు. నిబంధనలకు విరుద్దంగా ఇలా చేయడం నేరం అని ఆయన పేర్కొన్నారు. బాగా పాపులర్అయిన విజయ బ్రాండ్ను వాడుకోవడానికి వారి అభిమానుల్లో ఎవరైనా ఇలా ఎడిట్చేసి ఉంటారని ఈశ్వర్బాబు తెలిపారు. ఎప్పటికీ తమ సంస్థ మరోక బ్రాండ్ను ప్రచారం చేయదని క్లారిటీ ఇచ్చారు.

వీరమల్లు బజ్కోసం సోషల్‌మీడియాలో పవన్కల్యాణ్అభిమానులు ఎంచుకుంటున్న అడ్డదారులపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తప్పుడు దారిలో ప్రచారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కానీ, ఇలాంటి ఫేక్ప్రచారం మాత్రం ఎవరు చేసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనేనని కొందరు గట్టిగానే చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ బతుకు ఎందుకంటూ మండిపడుతున్నారు. అయితే, పవన్ ఫ్యాన్స్‌తో పాటు జనసేన శతఘ్ని సోషల్‌మీడియా ఖాతా నుంచి ఒక వివరణ వచ్చింది. ఇదంతా పవన్‌ మీద కోపంతో కొందరు కావాలని  ఇలా మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తున్నారని రాజకీయ రంగు పూసేందుకు తెర లేపింది. కానీ, సదరు పోస్టర్లను వైరల్చేస్తున్న వారి సోషల్మీడియా ఖాతాలను వారు ఒకసారి చెక్చేస్తే అసలు రంగు ఏంటో తెలుస్తుందని గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఆ పేజీలన్నీ పవన్కల్యాణ్అభిమానులవే అని క్లియర్గా తెలిసిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement