ACB Arrests TDP Leader Dhulipalla Narendra In Guntur Over Sangam Dairy Issue - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

Apr 23 2021 8:19 AM | Updated on Apr 23 2021 11:07 AM

TDP Leader Dhulipalla Narendra Arrest - Sakshi

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను అరెస్ట్‌ చేశారు.

సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయనను గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు.. సంఘం డెయిరీలో అవకతవకల ఆరోపణలపై విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

చదవండి: అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు
భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...

Advertisement
 
Advertisement
Advertisement