సాక్షి గుంటూరు: వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన గోడౌన్‌ను అధికారులు తెరిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. దీంతో దానిని తెరవాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు.
రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎన్ని దాడులు చేసినా, అట్రాసిటీ కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి గోడౌన్ తెరిచింది. గోడౌన్ మెుక్కజోన్న రైతులదేనని అధికారులు తేల్చారు.
మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన రైతులకు అండగా ఉండేందుకు చలో చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది కూటమి ప్రభుత్వం. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మరీ దౌర్జన్య కాండకు దిగింది. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గకపోవడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి సీజ్ చేసిన గోడౌన్‌ను తెరిచింది.


