జిల్లా ఎస్పీని కలిసిన అమరావతి ఎల్‌అండ్‌ఓ ఓఎస్డీ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఎస్పీని కలిసిన అమరావతి ఎల్‌అండ్‌ఓ ఓఎస్డీ

Jul 13 2026 1:04 AM | Updated on Jul 13 2026 1:04 AM

జిల్లా ఎస్పీని కలిసిన అమరావతి ఎల్‌అండ్‌ఓ ఓఎస్డీ

నగరంపాలెం: గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను ఆదివారం అమరావతి లా అండ్‌ ఆర్డర్‌ (ఎల్‌/ఓ) నూతన ఓఎస్డీ మనోజ్‌ రామనాథ్‌హెగ్డే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 2022 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మనోజ్‌ రామనాథ్‌హెగ్డే రాజంపేట నుంచి బదిలీపై అమరావతి ఎల్‌ అండ్‌ ఓకు బదిలీయ్యారు. అమరావతి రాజధాని ఏరియాకు ప్రాధాన్యత ఉందని జిల్లా ఎస్పీ అన్నారు. సున్నితమైన ప్రాంతంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తుళ్లూరు, సీఆర్డీఏ లో లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణలో ఇంటెలిజెనన్స్‌, ఎస్‌బీ సమాచారంతో ఉండాలని, ప్రజా భద్రతకై విధులు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement