కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి | Four Dead In Car Accident At Krishna District | Sakshi
Sakshi News home page

కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి

May 27 2024 9:18 AM | Updated on May 27 2024 10:26 AM

Four Dead In Car Accident At Krishna District

కృష్ణా, సాక్షి: కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ​కోడూరుపాడు వద్డ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్వామినాథన్ (40), రాకేష్ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడింది. దీంతో, ఆమెను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక, వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో మృతుందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అములుకున్నాయి. మరోవైపు.. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement