Minister Dadisetti Raja Serious Comments On TDP And Pawan Kalyan - Sakshi
Sakshi News home page

పవన్‌ డైవర్షన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు: దాడిశెట్టి రాజా

Oct 12 2022 11:08 AM | Updated on Oct 12 2022 11:34 AM

Dadisetti Raja Serious Comments On TDP And Pawan Kalyan - Sakshi

సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ డైవర్షన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్‌ చేయడానికే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో రోడ్లపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. బాగున్న రోడ్లకు గుంతలు పెట్టి డ్రామా చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టాము. రోడ్లు వేయడం అనేది నిరంతర ప్రక్రియ. వర్షాకాలం తగ్గిన వెంటనే రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రోడ్ల మరమ్మతుల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 1500 కోట్లు కేటాయించారు. 2023 కల్లా రాష్ట్రంలో రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement