కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు | Comments By Janasena Party Guntur District President Gade Venkateswara Rao | Sakshi
Sakshi News home page

కాపులను ఉద్ధరించేందుకు జనసేన పెట్టలేదు

Jun 23 2026 1:56 PM | Updated on Jun 23 2026 2:01 PM

Comments By Janasena Party Guntur District President Gade Venkateswara Rao

కాపులకే మేలు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం కాదు

రోజూ ఎంతో మంది చస్తుంటారు.. అందుకని రోడ్డెక్కాలా?

జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ‘కాపులను ఉద్ధరించేందుకు పవన్‌కళ్యాణ్‌.. జనసేన పార్టీని పెట్టలేదు. రాష్ట్రంలో రోజూ ఎంతో మంది చస్తూ ఉంటారు. అందుకని రోడ్డెక్కాలా?’ అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సోమవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్‌సీపీలోని కాపు నేతలను తాము కాపు సామాజికవర్గం నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. కాపులతో వారికి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపులకు ఏం చేశారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలను ప్రశి్నంచారు. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కాపులకు చేకూర్చిన సంక్షేమం, విడుదల చేసిన నిధుల వివరాలను ఆ పార్టీ కాపు సామాజిక నేతలు ప్రకటించారు కదా.. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారో చెప్పాలని విలేకరులు వెంకటేశ్వరరావును ప్రశి్నంచారు. ఆయన స్పందిస్తూ.. ఒక్క కాపులకే మేలు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement