జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్‌ | CM YS Jagan Will Release Jagananna Chedodu Scheme Funds Updates | Sakshi
Sakshi News home page

జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్‌

Oct 19 2023 8:40 AM | Updated on Oct 19 2023 12:44 PM

CM YS Jagan Will Release Jagananna Chedodu Scheme Funds Updates - Sakshi

నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అందజేయనున్న సీఎం జగన్‌..

Updates..

ఎమ్మిగనూరులో బటన్‌ నొక్కి జగనన్న చేదోడు సాయం అందజేసిన సీఎం జగన్‌

►సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూడండి. ఇచ్చిన మాటను 52 నెలల పాలనలో నిలబెట్టుకున్నాం. వెనుకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నాం. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నాం. 

ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయి. ప్రతీ అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.19178 కోట్లు అందజేస్తున్నాం. నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నాం. 

అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసింది. అ‍ప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు స్థలం ఇవ్వలేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం కొన్ని వేల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. 

చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మేనిఫెస్టోను తీసుకొచ్చి ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేశారు. కానీ, మన ప్రభుత్వం మేనిఫెస్టో 99 శాతం హామీలను అమలు చేశాం. చంద్రబాబు రుణమాఫీ కూడా చేయలేదు. బాబు హయాంలో పొదుపు సంఘాలు విలవిల్లాడాయి. 

అమరావతి రాజధాని భూములతో మొదలుపెడితే.. స్కిల్‌ స్కాం వరకు అన్నీ కుంభకోణాలే, అవినీతే. చంద్రబాబు ద్వారా నష్టపోయిన పొదుపు సంఘాలకు మీ బిడ్డ అనేక పథకాలతో తోడుగా ఉన్నాడు. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే 31లక్షల ఇంటి స్థలాలు అందించాం. 

గతంలో ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటి వద్దకే పౌరసేవలు అందుతున్నాయి. అప్పుట్లో ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేశారు. మీ బిడ్డ పాలనలో 18 మెడికల్‌ కాలేజీలు నిర్మాణం అవుతున్నాయి. మీ బిడ్డ పాలనలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. చికిత్స తర్వాత రోగికి సాయం అందిస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. 

మీ బిడ్డకు అర డజన్‌ టీవీ ఛానెళ్ల సపోర్టు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి టీవీలు లేవు. మీ బిడ్డ నమ్ముకుంది కేవలం పైనే దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు.. రేపు జరగబోయే యుద్ధంలో తేడేళ​ందరూ ఏకమవుతారు. వీళ్లు చెప్పిన అబద్దాలు నమ్మకండి. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా ఆలోచించండి. 

మంత్రి చెల్లబోయిన గోపాలకృష్ణ మాట్లాడుతూ..  అన్ని వర్గాలను నా వాళ్లు అని చెప్పుకున్న వ్యక్తి సీఎం జగన్‌. మన జీవితాలను మార్చిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌. మనందరి ఆకాంక్షలు తీర్చిన వ్యక్తి జగనన్న. గత పాలకులు బీసీలకు మోసం చేశారు. బలహీన వర్గాలను వెనక్కి నెట్టిన వారికి జగన్‌ అంటే భయం. 

►ఎమ్మిగనూరు చేరుకున్న సీఎం జగన్‌

►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►గన్నవరం నుంచి కర్నూలు జిల్లా బయల్దేరిన  సీఎం జగన్‌

►ఎమ్మిగనూరు బయలుదేరిన సీఎం జగన్‌

►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు సీఎం జగన్‌ గురువారం శ్రీకారం చుడుతున్నారు.

►కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. 

ఇదీ పథకం 
♦ షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం 
♦ గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం. 
♦  నాలుగేళ్లలో ఈ పథకం లబ్దిదారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు 
♦ 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి 
♦ 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి 
♦ 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి 
♦ లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక. 
♦  అర్హతలున్న ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు జగనన్న ప్రభుత్వం తపన... 
♦  అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందకపోతే... వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్‌ నెలల్లో సాయం అందజేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement