జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గాలివేగం పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గాలివేగం పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

రెండు ఆటోలు ఢీ

3వ తరగతి చదివే

ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

స్వల్పగాయాలతో బయటపడిన

మరో 8 మంది చిన్నారులు

రాయదుర్గం రూరల్‌: రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా, మరో 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. శనివారం సాయంత్రం రాయదుర్గం నుంచి 74 ఉడేగోళం గ్రామానికి విద్యార్థులతో ఆటో బయలుదేరింది. ఇదే క్రమంలో రాయదుర్గం వైపు వస్తున్న ఓ ఆటోను 74 ఉడేగోళం వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో రాయదుర్గంలోని స్టోన్‌ వ్యాలీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, ఇన్‌ఫ్యాట్‌ జీసేస్‌ స్కూల్‌కు చెందిన 3వ తరగతి విద్యార్థులు జశ్వంత్‌, సంయోగన్‌ తీవ్రంగా గాయపడ్డారు. తలకు ఐదు కుట్లు చొప్పున పడ్డాయి. వీరితో పాటు తన్మయ్‌, వర్షిత, దీపిక, మరో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పిల్లలను స్థానికులు వెంటనే రాయదుర్గం ప్రభుత్వానికి తరలించి వైద్య చికిత్సలందించారు. ఈ ఘటనపై అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రేపటి నుంచి

ఎంపీఈఓల పెన్‌డౌన్‌

ఆత్మకూరు: ఉద్యోగ భద్రతతో పాటు జీతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంపీఈఓలు ఈ నెల 20 నుంచి 25 వరకు పెన్‌డౌన్‌ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 329 మంది ఎంపీఈఓలు ఉండగా, వీరిలో 65 శాతం పైగా మహిళలే ఉండడం గమనార్హం. రెండు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ అధికారిని కలిసిన వారు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. ఎంపీఈఓలు పెన్‌డౌన్‌కు దిగితే క్షేత్రస్థాయిలో రైతులకు కష్టాలు తప్పవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement