
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న డీఎం అండ్ హెచ్‌వో ఎం.హైమావతి
అనకాపల్లి: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని డీఎం అండ్ హెచ్‌వో ఎం.హైమావతి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షా కాలంలో వరదలు, అంటువ్యాధుల నివారణ అనే అంశంపై శనివారం పోస్టర్ ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు బారినపడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ఎస్.రమణ, డీఎస్‌వో షరీఫ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.