
ఆదర్శనీయులు ప్రకాశం పంతులు
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. 154వ జయంతి సందర్భంగా టంగుటూరి చిత్రపటానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు నీతి నిజాయితీ, నైతిక విలువలు,త్యాగనిరతి, ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.