
పెన్షన్ల పునరుద్ధరణ కోసం..
న్యూస్‌రీల్
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అన్యాయంగా తొలగిస్తున్న పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌తో పాటు వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు.
పరుగులు పెట్టించిన భారీ కొండచిలువ
కోటవురట్ల: భారీ కొండచిలువ స్థానిక రైతుల చేతిలో హతమైంది. రాట్నాలపాలెం శివారు కొండను ఆనుకుని ఉన్న తుమ్మలపల్లి ఆంజనే యులు పొలంలో ఆదివారం వ్యవసాయ పను లు చేస్తున్నారు. అదే సమయంలో 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించేసరికి కూలీ లు హడలెత్తి పరుగులు తీశారు. ధైర్యం చేసిన కొందరు కొండచిలువను హతమార్చారు.