
పచ్చనేతల ప్రచార యావ..
మాడుగుల రూరల్ : అధికారంలో ఉన్న కూటమి నాయకుల ప్రచారానికి గుడి, బడి అంటూ తేడా ఏమీ లేదు. మండలంలో వి.వి.అగ్రహారం ఎంపీయూపీ పాఠశాల గేటు ప్రవేశ ద్వారం వద్ద పెద్ద డిజిటల్ బోర్డును ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేశారు. ఆరోజున దేశం పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టరు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్దాది నుంచి వి.వి.అగ్రహారం గ్రామం వరకు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద బోర్డు ఏర్పాటు చేసి, 10 రోజులు కావస్తున్నా సరే బోర్డును ఇక్కడ నుంచి తొలగించలేదని విద్యార్థులు, గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు.