
అనకాపల్లి పోలీసుల సైకిల్ ర్యాలీ
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ నగరం విశాలాక్షినగర్‌లోని ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ మైదానం నుంచి అనకాపల్లి జిల్లా పోలీసులు ఆదివారం ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. కై లాసగిరి కూడలి నుంచి బయలుదేరి జోడుగుళ్లపాలెం నుంచి బీచ్ రోడ్డులో సీతకొండ మీదుగా సాగర్‌నగర్ వరకు ఉత్సాహంగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కీలకమన్నారు. ఆరోగ్యం దేశాన్ని బలోపేతం చేసి శక్తని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.