
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
యలమంచిలి రూరల్ : ఏటికొప్పాక శివారు ప్రాంతంలో కొండను తవ్వి గ్రావెల్‌ను అక్రమంగా తరలించడానికి వినియోగించిన పొక్లెయిన్, ట్రాక్టర్‌ను యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర ఆదివారం స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన సిబ్బందిని అక్కడకు పంపించి వాహనాలను స్వాధీనపర్చుకుని యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆదివారం సెలవు కావడంతో సోమవారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.
పొక్లెయిన్, ట్రాక్టర్ సీజ్