
మూడు తరాల్లోనూ ఉపాధ్యాయులే
అచ్యుతాపురం : ఆ కుటుంబంలో మూడు తరాల వారు ఉపాధ్యాయ ఉద్యో గం చేసే అదృష్టాన్ని పొందారు. అచ్యుతాపురం మండలంలోని మడుతూరుకు చెందిన నామాల వెంకటరమణ ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీవిరమణ పొందిన తర్వాత చనిపోయారు. వెంకటరమణ కుమారుడు నామాల సత్యశ్రీనివాస్ ప్రస్తుతం హరిపాలెం ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ కుమర్తె నీలిమ తాజాగా 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టు, ఎస్‌జీటీ పోస్టుకు కూడా ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్ బయోలజికల్ సైన్స్‌లో జిల్లా స్థాయిలో 4వ ర్యాంక్,ఎస్‌జీటీ విభాగంలో జిల్లా స్థాయి లో 96వ ర్యాంక్ సాధించారు. తొలి ప్రయత్నంలోనే తన కుమార్తె రెండు పోస్టులకు ఎంపికయ్యారని, మా కుటుంబంలోని మూడు తరాల వారికి ఉపాధ్యాయ వృత్తి చేసే అదృష్టం దక్కిందని శ్రీనివాస్ సాక్షికి తెలిపారు.