
వీవోఏలు పోరాటానికి సిద్ధం కావాలి
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో వీవోఏలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వీవోఏల (యానిమేటర్ల) జిల్లా 4వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్‌ను అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. వీవోఏల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని సభలో తీర్మానం చేశారు. వీవోఏల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్ రూపాదేవి, వీవోఏల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.సూరిబాబు, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శికోటేశ్వరరావు పిలుపు

వీవోఏలు పోరాటానికి సిద్ధం కావాలి