
సాక్షి, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాస్‌పై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దొండపూడి గ్రామ దేవత పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, స్పీకర్ వెళ్లే సమయంలో పక్కన ఎస్కార్ట్ లేకపోవడంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
