
చీపురు పట్టిన ఎస్పీ తుహిన్ సిన్హా
● కార్యాలయ ఆవరణలో చెత్తా చెదారాలు తొలగింపు
చీపురుతో చెత్త ఊడ్చుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: నిత్యం పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండే ఎస్పీ తుహిన్ సిన్హా చీపురు పట్టి చెత్తా చెదారాలు ఊడ్చారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ఆయన పోలీసు సిబ్బందితో కలిసి తమ కార్యాలయ ఆవరణలో చెత్తా చెదారాలు ఊడ్చటంతోపాటు పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని తమ సిబ్బంది నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏఎస్పీ ఎల్.మోహనరావు, డీఎస్పీ బి.మోహనరావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యరావు, సురేష్, రామకృష్ణ, ఎస్‌ఐలు ప్రసాద్, మల్లేశ్వరరావు, శిరీష తదితరులు పాల్గొన్నారు.