
విశాఖ డెయిరీ అవినీతిపై విచారణ జరపాలి
మునగపాక : విశాఖ డెయిరీ అవినీతిపై విచారణ చేపట్టాలని ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు డిమాండ్ చేశారు. మండలంలోని చూచుకొండ, గణపర్తి, పల్లపు ఆనందపురం, కుమారపురం గ్రామాల్లో విశాఖ డెయిరీ అవినీతిపై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని కోరుతూ రైతులకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో పాడి రైతులకు కల్పతరకువుగా ఉన్న విశాఖ డెయిరీని తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను నష్టాల పాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత పాలకవర్గం అంతులేని అవినీతికి పాల్పడుతుందన్నారు. పాల ధరను కూడా తగ్గించడం ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విశాఖ డెయిరీని కాపాడుకునేందుకు త్వరలో జరగనున్న జనరల్ బాడీ సమావేశానికి రైతులు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో పాడిరైతులు కాండ్రేగుల రమణ,చదరం వెంకటరమణ, పొలమరశెట్టి వెంకటప్పారావు,కాండ్రేగుల నాయుడు పాల్గొన్నారు.
అప్పారావు, బ్రహ్మాజీ