
సీఆర్‌సీఎఫ్‌వీ భవనానికి శంకుస్థాపన
పాయకరావుపేట : పెంటకోట తీరప్రాంతంలో కమ్యూనిటీ రీసిలియంట్ కోస్టల్ ఫిషర్‌మెన్ విలేజ్ (సీఆర్‌సీఎఫ్‌వీ) పథకం కింద భవనాలు నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మత్స్యకారుల సౌలభ్యం కోసం కమ్యూనిటీ హాల్, చేపల ప్లాట్ ఫారాలు, సోలార్ లైటింగ్, తదితర ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, చించలపు పద్దూ, చిక్కాల శ్రీనివాసరావు, యాళ్ల వరహాలు, కొప్పిశెట్టి వెంకటేష్, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.