
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
చోడవరం: మండలంలోని వెంకన్నపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ జోగారావు అందించిన వివరాల ప్రకారం..వెంకన్నపాలెం నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వస్తున్న మండలంలోని ఎం. కొత్తపల్లికి చెందిన వెదిరి రామునాయుడు (42) అక్కడే మృతి చెందాడు. నంబారు సోమినాయుడు రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. రామునాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, గాయపడిన సోమినాయుడును ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాదంలో బైక్ దెబ్బతింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.