
కొలువు గురువు
నక్కపల్లి: డీఎస్సీ ఫలితాల్లో పేదింటి అభ్యర్థులు ప్రతిభ కనబరిచారు. నక్కపల్లి మండలానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. దోసలపాడు గ్రామానికి చెందిన భవిరి శెట్టి రామకృష్ణ సోషల్ స్టడీస్‌లో జిల్లాలో 2వ ర్యాంకు సాధించాడు. రామకృష్ణ తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణించారు. అన్నయ్య, అమ్మమ్మ, నాన్నమ్మల వద్ద ఉంటూ ఉన్నత చదువులు చదివి డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. గొడిచర్ల గ్రామానికి చెందిన కర్రి నాగేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో సోషల్ స్టడీస్‌లో 3వ ర్యాంకు సాధించాడు. ఈయన మోటారు సైకిళ్లకు సీట్లు కుట్టే షాపు నిర్వహిస్తూ బీఈడీ పూర్తి చేశాడు. కష్టపడి చదువుకుని స్కూల్ అసిస్టెంట్‌కు ఎంపికయ్యాడు. గొడిచర్ల గ్రామానికి చెందిన చెల్లపు లావణ్య 91 శాతం మార్కులతో జిల్లాలో ఎస్‌జీటీ విభాగంలో ఏడో ర్యాంకు సాధించింది. ఎస్‌జీటీలో డొంకాడ గ్రామానికి చెందిన ప్రగడ సురేష్ 133వ ర్యాంకు, చందిన సంతోష్ 178వ ర్యాంకు సాధించారు.
ఎస్జీటీలో మెరిసిన కుమారి
మాడుగుల: డీఎస్సీ ఎస్జీటీ విభాగంలో సత్యవరం గ్రామానికి చెందిన ఎడ్ల కుమారి 90.47079 మార్కులతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 12వ ర్యాంకుతో మెరిసింది. తండ్రి మరిడినాయుడు వ్యవసాయ కూలి. పట్టుదలతో చదివి డీఎస్సీలో కొలువు సాధించిన కుమారిని కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో సివిల్స్ సాధనే తన లక్ష్యమని కుమారి చెప్పారు.
రావికమతం: మండలంలో సుమారు 25 మంది డీఎస్సీలో సత్తా చాటారు. కొత్తకోటకు చెందిన విరోతి ఆనంద్ ఫిజికల్ డైరెక్టర్(పీడీ) 90.5 స్కోర్ సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. టి.అర్జాపురంలో సీతిని జోగినాయుడు,(ఎస్‌ఏ), ఎస్‌జీటీలుగా కోల సత్తిబాబు, మడగల సత్యవేణి, మలిచెట్ల కుసుమ, గంధం మహేష్, పిల్ల ధనలక్ష్మి, దొండపూడి నుంచి తోట స్వాతి ఎంపికయ్యారు.
హిందీలో జిల్లా ఫస్ట్ జ్యోత్స్న
చోడవరం: డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లో చోడవరానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. హిందీ విభాగంలో కురచా జోత్స్న జిల్లా మొదటి స్థానం సాధించగా.. సోషల్‌లో మహిళా విభాగంలో పందిరి పరమేశ్వరి జిల్లాలో 7వ ర్యాంక్ సాధించారు. వీరిద్దరూ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శివకు 26వ ర్యాంక్
కె.కోటపాడు : మండలంలో చౌడువాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బంటు శివ డీఎస్సీలో ఓపెన్ కేటగిరిలో సోషల్‌లో 78.31 మార్కులతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 26వ ర్యాంక్ సాధించాడు. 2005లో డిగ్రీ పూర్తి చేసిన శివ భారత సైన్యంలో చేరాడు. 17 ఏళ్ల పాటు ఆర్మీలో విధులు నిర్వహించి, 2021లో రిటైర్ అయ్యాడు. అనంతరం ఏయూలో 2021 నుంచి 2023 వరకూ బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీకి ప్రిపేర్ కావడంతో పాటు కానిస్టేబుల్ పోస్టుకు కూడా ఇంటి వద్ద నుంచే శివ శిక్షణ పొందాడు.ఇటీవల సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శుక్రవారం రాత్రి విడుదలైన డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో ఓపెన్ కేటగిరిలో జిల్లాలో 26వ ర్యాంక్‌ను సాధించాడు. ఆర్మీలో దేశానికి సేవ చేయడంతో పాటు రిటైర్ అయిన తరువాత కూడా రెండు ఉద్యోగాలకు ఎంపిక అయిన శివను పలువురు అభినందించారు. శివ ర్యాంక్ సాధించడం పట్ల తల్లి అప్పలనర్సమ్మ, భార్య వరలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. శివకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
డీఎస్సీ ఫలితాల్లో పేదింటి అభ్యర్థుల సత్తా

కొలువు గురువు

కొలువు గురువు

కొలువు గురువు

కొలువు గురువు

కొలువు గురువు

కొలువు గురువు

కొలువు గురువు

కొలువు గురువు