
పాఠశాలలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు
గొలుగొండ: చోద్యం సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికై న చిటికెల సాంబమూర్తికి స్వాగతం పలుకుతూ ఇటీవల స్థానిక పాఠశాల ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు తొలగించారు. స్కూలా– టీడీపీ కార్యాలయమా? శీర్షికతో శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం ఉదయం 7 గంటలకే పాఠశాల ప్రధాన ద్వారం వద్ద టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. విద్యా సంస్థల వద్ద ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాఠశాలలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు

పాఠశాలలో టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు