
డి.గొట్టివాడలో పూరిల్లు దగ్ధం
● రూ.3 లక్షల ఆస్తి నష్టం
మాడుగుల రూరల్: మండలంలో డి.గొట్టివాడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. గ్రామానికి చెంది నంబారు గోసం నాయుడు, నంబారు చినతల్లి పూరింటిలోని రెండు గదుల్లో నివాసముంటున్నారు. అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 15 బస్తాల ధాన్యం, లక్ష రూపాయల నగదు, భూమిపత్రాలు, దుస్తులు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే అన్ని కాలిపోయాయి. బాధితులు తీవ్రంగా రోదిస్తున్నారు. వీఆర్వో సంఘటనా స్థలాిన్ని పరిశీలించి నష్ట నివేదిక తహసీల్దార్ అందజేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు.

డి.గొట్టివాడలో పూరిల్లు దగ్ధం