
ఉచిత బస్సుకోసం పాట్లు..ఫీట్లు
త్రుటిలో తప్పిన ప్రమాదం
అడ్డురోడ్డు బస్సుకోసం ఎదురు చూస్తున్న మహిళలు
ఎస్.రాయవరం : ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ఫ్రీ బస్ ఎక్కేందుకు మహిళలు క్యూ కట్టారు. అడ్డురోడ్డు బస్టాండ్‌లో సుమారు 15 మందికి పైగా బస్సుకోసం ఎదురు చూస్తుండగా స్థానిక ఆటో డ్రైవర్లు వీడియో తీసి సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేశారు. ఈ సమయంలో జంక్షన్‌లో విక్రయించుకునేందుకు తెచ్చుకున్న కుర్చీలపై వరుసలో కూర్చుని బస్సుల కోసం వేచి చూశారు. బస్సు రాగానే కిక్కిరిసిన బస్సులో ఎక్కి సీట్లు కోసం ఎగబడ్డారు. కగా మహిళలకు ఉచిత బస్సు పథకం తమను తీవ్రంగా దెబ్బకొడుతోందని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.