
ఎన్టీపీసీ విజిలెన్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎన్టీపీసీ చీఫ్ విజిలెన్స్ అధికారి రస్మితా ఝా
పరవాడ: దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీలో మూడు నెలలపాటు జరిగే ‘విజిలెన్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్’ మంగళవారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) రస్మితా ఝా ఈ ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజిలెన్స్ అనేది మనందరి భాగస్వామ్య బాధ్యత అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను, కేసులను సకాలంలో పరిష్కరించాలని, పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ విధానాలను బలోపేతం చేయాలని ఆమె అధికారులను కోరారు. ఉద్యోగులు, విక్రేతలు, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. నాటకాలు, క్విజ్‌లు, వీడియోలు, విక్రేతల సమావేశాల ద్వారా ఈ ప్రచారాన్ని సృజనాత్మకంగా నిర్వహించాలని ఆమె అన్నారు. గతేడాది ఈ ప్రచారం విజయవంతమైందని, ఈ ఏడాది కూడా విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం నవంబర్ 17 వరకు కొనసాగుతుందన్నారు.