
తాండవకు వరదతాకిడిపై అప్రమత్తం
నాతవరం : తాండవ రిజర్వాయరులో నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం ఆర్డీవో విల్లూరి వెంకట రమణ అన్నారు. ఆయన సోమవారం తాండవ రిజర్వాయరును సందర్శించారు. ప్రాజెక్టులో సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 375.2 అడుగులు ఉందని డీఈ అనురాధ తెలిపారు. రిజర్వాయరు ప్రమాదస్ధాయి నీటి మట్టం 380 అడుగులు కాగా 378 అడుగులకు నీరు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేసి స్పిల్‌వే గేట్లు ద్వారా నదిలోకి నీరు విడుదల చేస్తామన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో నీరు తాండవ ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుందన్నారు.