పాడేరు రూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్‌గా డాక్టర్ పి. జానకిరావు బాధ్యతలు స్వీకరించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జిల్లా పేర్లు, ఇతర వివరాలు కనిపించకపోయినా విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సమాచారం కావాలన్నా హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించి పూర్తిస్థాయి సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. అందరి సహకారంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని జానకిరావు పేర్కొన్నారు.


