సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీసుస్టేషన్‌కు సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన పోస్టాఫీస్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. పాతబస్టాండ్ అంబేడ్కర్ సెంటర్‌లో ఉన్న పోస్టాఫీస్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు నిల్వ చేసే బాక్సులను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూ.1.70 లక్షల నగదు చోరీకి గురైనట్లు పోస్టల్ అధికారి సింహాచలం తెలిపారు. మంగళవారం ఉదయం పోస్టాఫీస్ తెరిచేందుకు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకోగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పాడేరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది పోస్టాఫీసుకు చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన నగదు బాక్సులతో పాటు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను క్లూస్‌టీం పరిశీలించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రామారావు తెలిపారు. పోలీసుస్టేషన్‌కు అత్యంత సమీపంలోనే పోస్టాఫీస్‌లో చోరీ జరగడంతో పాడేరు వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి..లోపలికి ప్రవేశించిన దొంగలు
నగదు బాక్సులు ధ్వంసం..రూ.1.70 లక్షల చోరీ
ఉదయం పోస్టాఫీస్ తెరిచేందుకు రాగా వెలుగులోకి ఘటన
రంగంలోకి క్లూస్‌టీం..సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన
పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే చోరీతో అవాకై ్కన పాడేరు వాసులు
నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: సీఐ రామారావు


