మునగపాక: రైతులు సీజన్‌లో పశువులకు అంటు వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశు వంవర్దక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కేఎల్‌ఎన్ స్వామి కోరారు. మండలంలోని ఒంపోలు గ్రామంలో జరుగుతున్న లంపీ స్కిన్ డిసీజ్(పశువుల బొబ్బల వ్యాధి) టీకాల కార్యక్రమాన్ని బుదవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు తీవ్రమైన జ్వరం , శరీరమంతా బొబ్బలు, మచ్చలు ఏర్పడడం, పొల దిగుబడులు గణనీయంగా తగ్గినట్టయితే వ్యాధి లక్షణాలుగా గుర్తుంచుకోవాలన్నారు. ఒక పశువు నుంచి వేరే పశువుకు వేగంగా సంక్రమించే వ్యాధి కావడంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఆవుజాతి పశువులన్నింటికీ టీకాలు వేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆవుజాతి పశువులకు ఎల్‌ఎస్‌డీ టీకాలు వేయించాలన్నారు. పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్.గణేష్,పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ జ్యోత్స ్నతో పాటు పలువురు రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


