ఎస్.రాయవరం: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న బస్‌కాంప్లెక్స్ స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలని గ్రామానికి చెందిన సోమిరెడ్డి రాజు హైకోర్టులో కేసు వేసినట్టు చెప్పారు. నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న 25 సెంట్లు స్థలాన్ని అప్పటి రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం పంచాయతీ నుంచి 25 ఏళ్ల క్రితం స్థలం కేటాయించారు. ఆ తరువాత ఆర్టీసీ యాజమాన్యం బస్‌కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు బస్‌కాంప్లెక్స్, స్థలం ప్రయాణికులకు ఉపయోగపడలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయోజనాలకు అవసరం లేనందున తిరిగి ఈ స్థలం పంచాయతీ కేటాయించాలని పలుమార్లు అనకాపల్లి డిపో అధికారులకు ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఈ స్థలాన్ని తిరిగి గ్రామానికి కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోర్టు వారిని కోరుతున్నట్టు సోమిరెడ్డి రాజు చెప్పారు.
రేపు మెగా జాబ్ మేళా
మహారాణిపేట(విశాఖ): జిల్లా ఉపాధి కార్యాలయం (టెక్నికల్–క్లరికల్), నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. కంచరపాలెంలోని గర్ల్స్ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కార్యాల య ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. టీసీఐ, ఇన్నో వ్ సోర్స్, నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్‌కార్ట్, డీమార్ట్, ఫాక్స్‌కాన్, గ్లోరీ వెండర్, శుభగృహ, వరుణ్ మోటార్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, అపిటోరియా తదితర సంస్థలు ఇందు లో పాల్గొంటాయి. అసిస్టెంట్ సూపర్‌వైజర్, సేల్స్‌మేనేజర్, క్యాషియర్,లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటి వ్, ఫార్మసిస్ట్, టెలికాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఐఫోన్ అసెంబ్లింగ్ ఆపరేటర్, జూనియర్ కెమిస్ట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


