స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌కు భూములిచ్చేది లేదు | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌కు భూములిచ్చేది లేదు

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

నక్కపల్లి: ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు గునిపూడి లక్ష్మీదేవి కొండపై భూములు ఇచ్చే ప్రసక్తి లేదని ఈ భూములు సాగు చేసుకుంటున్న సాగుదారులు స్పష్టం చేశారు. టౌన్‌షిప్‌కు భూములు కేటాయించడాన్ని నిరసిస్తూ సాగుదారులు చేస్తున్న నిరసన వంటావార్పు కార్యక్రమం ఆరోరోజు కొనసాగింది. బుధవారం ఈ దీక్షలో పాల్గొన్న సీపీఎం నాయకులు ఎం.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో పేదలకు ఈ భూములు తప్ప వేరే దారిలేదన్నారు. తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం ఈ భూములు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పట్టాలు ఇస్తే ప్రభుత్వం తరపున నష్టపరిహారం పొందే అవకాశం ఉందని లబ్ధిదారులు పట్టాలు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిబంధనలు ఒప్పుకోవంటూ తిరస్కరించిందన్నారు. ఇవే భూములు టౌన్‌షిప్‌ కోసం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎట్టిపరిస్దితుల్లో ఈ భూములను స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌కొరకు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. భూముల్లో ట్రెంచ్‌ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సాయంతో ఏదైనా చేయొచ్చనే మొండి వైఖరితో ప్రభుత్వం ఉందన్నారు. సాగుదారులు ప్రాణాలకు తెగించి ఈ భూములను కాపాడుకుంటారని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతు సంఘనాయకులు ఎం.రాజేష్‌, డి.కృష్ణ, బి.బాబ్జి, ముసలయ్య, బి.నాయుడు, చంటిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement